VIDEO: విజయవాడ ఎలా మునిగిందో చూడండి!

84చూసినవారు
విజయవాడను వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలసిందే. బుడమేరు ఉప్పొంగడంతో బెజవాడ మునిగింది. వరద వచ్చిన రోజు అజిత్‌సింగ్‌ నగర్‌లో సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ నెల 1న బుడమేరు వాగుకు గండి పడి అజిత్‌సింగ్‌ నగర్ కాలనీని ముంచెత్తింది. ఆ రోజు ఉదయం 9 గంటలకు నెమ్మదిగా వరద మొదలైంది. మూడు గంటల్లో నాలుగు అడుగులకు నీరు చేరింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ట్యాగ్స్ :