పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి చెందిన దేశముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి 60 గ్రామాలకు పాలకుడు. అతను రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ నాయకత్వంలో ఉపనాయకుడిగా ఉండేవాడు. ఈ క్రమంలో రాం చంద్రారెడ్డి కుమారుడు బాబుదొర ఆగడాలకు అంతులేకుండా పోయింది. పేదలను సజీవ దహనం చేయడం, పంటపొలాలకు నిప్పు పెట్టడం, ఆడవారి మానప్రాణాలు దోచుకుంటూ దుర్మార్గంగా వ్యవహరించాడు. దొరల దాష్టీకానికి వ్యతిరేకంగా పాలకుర్తిలో ఆంధ్ర మహాసభ ఏర్పాటుకు ఐలమ్మ భర్త నర్సింహ, కుమారులు, మరికొంత మంది కృషి చేశారు.