తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. డ్యామ్ గేట్లను తాజాగా నిపుణుల కమిటీ తనిఖీ చేసింది. డ్యామ్ గేట్లు మొత్తం మార్చాలని, మరమ్మతులు చేస్తే డ్యామ్‌కే ప్రమాదమని తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్లు జీవితకాలం 45 ఏళ్లు అని, ఇప్పటికే 25 ఏళ్లు అదనంగా గేట్లను వినియోగించినట్లు పేర్కొంది.