Nov 25, 2024, 16:11 IST/మంథని
మంథని
రామగిరి: బైండోవర్ ఆంక్షలు ఉల్లంఘిoచిన మహిళకు జైలు శిక్ష
Nov 25, 2024, 16:11 IST
రామగిరి మండలం కల్వచర్లకు చెందిన బాలసాని సత్తెమ్మ అనే మహిళ బైండోవర్ ఆంక్షలు ఉల్లంఘించగా, జైలు శిక్ష విధించినట్లు మంథని ఎక్సైజ్ సీఐ రాకేష్ కుమార్ సోమవారం తెలిపారు. గుడుంబా విక్రయించినందుకు గతంలో తహసీల్దార్ ఎదుట హాజరు పరచి బైండోవర్ చేసినా ఆంక్షలు ఉల్లంఘించి గుడుంబా అమ్మకాలు చేయడంతో కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట హాజరు పరచగా లక్ష జరిమానా విధించారు. జరిమానా కట్టనందున తహసీల్దార్ 284 రోజుల జైలు శిక్ష విధించారు.