
విజయవాడ: దీపకాంతులతో వెలుగొందుతున్న అసెంబ్లీ
ఈనెల 26వ తేది ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించడంతో ఆ భవనాలన్నీ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ముఖ్యంగా సచివాలయం ప్రధాన ప్రవేశ మార్గానికి సమీపంలో మువ్వన్నెల జాతీయజెండా నమూనారంగులతో కూడిన విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆ భవనం అత్యంత ఆకర్షణీయంగా ఉట్టిపడేలా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.