Jan 30, 2025, 08:01 IST/
మహాత్మగాంధీకి గవర్నర్, సీఎం నివాళులు
Jan 30, 2025, 08:01 IST
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్, లంగర్‌హౌస్ బాపూ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల, పొన్నం, పొంగులేటి, సురేఖ, వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్, CS శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.