పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ వై. సింహాచలం నేతృత్వంలో శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అంపావల్లి గ్రామనికి చెందిన ఓ వ్యక్తి వద్ద అక్రమంగా మద్యం కలిగిన 100 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. గ్రామాల్లో అక్రమ మద్యం బాటిళ్లు లభ్యమైతే కఠిన చర్యలు తప్పవన్నారు.