గంగాడ సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర
బలిజిపేట మండలం గంగాడ సచివాలయాన్ని బుధవారం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించగా పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ విధులకు హాజరు కాలేదు తెలుసుకొన్నారు. అయన కార్యదర్శికి స్వయంగా ఫోన్ చేసిన స్పందించనందున ఎంపీడివోకు తెలియజేసి ఉన్నతాధికారులతో మాట్లాడి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.