AP: మంత్రి కొల్లు రవీంద్ర మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ‘రూ.99కే మద్యం అందించడంపై మంచి ఆదరణ వస్తోంది. ఇప్పటివరకు 5 లక్షల కేసులకు పైగా విక్రయాలు జరిగాయి. పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాయి. అవి కూడా ఉత్పత్తి సామర్థం పెంచుకుని, నాణ్యమైన మద్యం సరఫరా చేయనున్నాయి.’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.