మత్తు పదార్థాలపై అవగహన కార్యక్రమం
గజపతినగరం మండలంలోని పాత శ్రీరంగరాజపురం గ్రామంలో గురువారం ఎస్ఐ కె. లక్ష్మణరావు మత్తు పదార్థాలపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మత్తు రహిత పల్లెలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు అనిపిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు.