Mar 06, 2025, 03:03 IST/నిర్మల్
నిర్మల్
నిర్మల్: చేపలు పట్టడానికి వెళ్లి వృద్ధురాలి మృతి
Mar 06, 2025, 03:03 IST
చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం నిర్మల్ మండలం గాంధీనగర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం గాంధీనగర్ కు చెందిన లక్ష్మీబాయి (54) సరస్వతి కాల్వకు చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. మృతురాలి కొడుకు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.