ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం అనారోగ్యంతో శ్రీకాకుళంలోని జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలు తర్వాత తుదిశ్వాస విడిచారు. పాలకొండలో ఉంటున్న రాజశేఖరం జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, ఎమ్మెల్యే, రాజ్యసభలో ఎంపీగా సేవలు అందించారు. వీరఘట్టం మండలం నీలానగరం కు చెందిన వీరు 1970లో సర్పంచ్ గా గెలవడంతో రాజకీయం ప్రస్థానం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వీరి కుమార్తె.