సాలూరు పట్టణంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా 9వ రోజున ప్రభుత్వానికి నిరసనగా భిక్షాటన కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా అంగనవాడిల ఉపకార్యదర్శి బలగ రాధ మరియు సిఐటియు జిల్లా ఉప కార్యదర్శి నాయుడుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాధా మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చాలని ఆమె కోరారు.