రాచకిండాం, కొండకిండాం గ్రామంలో రెవెన్యూ సదస్సు
బొండపల్లి మండలం రాచకిండాం, కొండకిండాం గ్రామాల్లో శనివారం రెవెన్యూ సదస్సులను చేపట్టారు. తహసిల్దార్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యలు రెవెన్యూ సదస్సులు ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏం. ప్రమీల గాంధీ పాల్గొన్నారు.