సీబీఐ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్‌పాల్‌కు గుంటూరు జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజును గతంలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఆయనను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వాస్తవాలు రాబట్టేందుకు ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలుపగా న్యాయమూర్తి విజయ్‌పాల్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.