ప్రస్తుతం చలి పంజా విసురుతోంది. ఇదే అదనుగా మందుబాబులు రోజూ మందు తాగుతుంటారు. అయితే అలా చేయడం ప్రమాదకరమంటున్నారు వైద్య నిపుణులు. ఇలా తాగడం వల్ల శ్వాస కోశ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఫ్లూ వస్తే అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కఫంలో రక్తం వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లడం మంచిది. చలిగాలుల తీవ్రత తగ్గేవరకు జాగ్రత్తగా ఉండడం బెటర్.