త్వరలో విశాఖ ఫైల్స్ విడుద‌ల‌: గంటా శ్రీనివాసరావు

73చూసినవారు
త్వరలో విశాఖ ఫైల్స్ విడుద‌ల‌: గంటా శ్రీనివాసరావు
AP: విశాఖలో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. "క‌శ్మీర్‌ ఫైల్స్‌ తరహాలో త్వరలోనే విశాఖ ఫైల్స్‌ విడుదల చేస్తాం. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్‌ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారు. కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తాం. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు" అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్