మాకవరపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో విద్యార్థులకు శుక్రవారం ఆటలు పోటీలను వైస్ ఎంపీపీ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయి పోటీలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.