Jan 15, 2025, 15:01 IST/
గాజాపై ఇజ్రాయిల్ దాడి.. 62 మంది మృతి
Jan 15, 2025, 15:01 IST
ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్‌లోని ఇళ్లు, పాఠశాలలపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో గడిచిన 24 గంటల్లో 62 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో 46,707 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, కనీసం 110,265 మంది గాయాలపాలయ్యారని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కాగా, ఇజ్రాయిల్ సైన్యం గాజాపై ఏడాదికిపైగా దాడులు చేస్తూనే ఉంది.