Oct 26, 2024, 12:10 IST/
TG: సన్న వడ్లకు రూ.500 బోనస్.. కేబినెట్ ఆమోదం
Oct 26, 2024, 12:10 IST
తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో సన్న వడ్లకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంచాలని నిర్ణయించింది. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.