‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరగనుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నియామక ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ / స్టోర్ కీపర్ ట్రెడ్స్‌కు పదో తరగతి అర్హతగా ఉండాలని పేర్కొన్నారు. ఇక, మ
హిళా మిలిటరీ పోలీస్ అభ్యర్థులు ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ
నోటిఫికేషన్ ప్రకారం అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని సూచించారు.