రాయలం అంటే సమాజ సేవలో ముందు ఉంటుందని మరోసారి రుజువు చేసిందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం భీమవరం మండలం రాయలం గ్రామ ప్రజలు విజయవాడ వరద బాధితుల సహాయార్ధం రూ 5, 00, 116 లను ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. కష్ట సమయంలో బాధితులను ఆదుకోవడానికి దాతలు స్పందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.