జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘దేవర’. సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో సందడి చేసింది తారక్ అండ్ టీం. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమకు చెన్నై స్టెపింగ్ స్టోన్‌లాంటిది. చెన్నైతో సంబంధం లేకుండా ఏ సినిమా ప్రమోషన్స్ కూడా ఉండదు. మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం. కానీ సినిమాల పరంగా మాత్రం కాదని చెప్పుకొచ్చాడు.