సిఐటియు ఆధ్వర్యంలో అల్లూరు సత్యనారాయణ వర్ధంతి

62చూసినవారు
సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక నేత అల్లూరు సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం తణుకులో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల భవనం వద్ద అల్లూరు సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసిన నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల శ్రమను దోచుకుంటున్న భూస్వాములకు వ్యతిరేకంగా సత్యనారాయణ పోరాడారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్