భారీ వర్షాలు, పొంగిన వాగులు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. చాన్నాళ్ల తర్వాత మెట్ట ప్రాంతాల్లోను చెరువులకు గండి పడడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు. జిల్లా యంత్రాంగం తక్షణం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణ నష్టం తప్పింది. అధికారులు చురుగ్గా కదలడంతో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. నూజివీడు, పెదపాడు మండలాల్లో సహాయ శిబిరాల్లో 1200 మందికి పైగా చేరారు. మరోవైపు గోదావరి ఉరకలు వేస్తోంది. పోలవరం వద్ద వరద ఉధృతి పెరిగింది.