అకాల ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా గోపాలపురం మండల పరిధిలోని భీమోలు గ్రామంలో సుమారు వెయ్యి ఎకరాల మొక్కజొన్న పంట దెబ్బతిందని తెలిసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు పంట పొలాలను పరిశీలించి నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మార్కెట్ యార్డు ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేసిన మంచి గిట్టుబాటు ధర చెల్లించాలని సూచించారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేసి రైతుల పక్షాన పోరాడతామని ప్రభుత్వాన్ని కోరారు. వారి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు చదలవాడ ప్రసాద్, మేన్ని సుధాకర్ ,వడ్లమూడి రమేష్ , నూతంగి దొరబాబు, కూనపోము ప్రసాద్ బాబు, దాకవరపు అప్పారావు, సొన్నాయిల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.