ఘనంగా జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అత్తిలి మండలం మంచిలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఘనంగా జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భవాని పీఠంలో ఆదివారం ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించారు. అమ్మవారి దీక్ష చేపట్టిన భవానీలు, స్థానిక భక్తులు భక్తి, శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.