బకెట్లో పడి 10 నెలల బాలుడు మృతి

50చూసినవారు
బకెట్లో పడి 10 నెలల బాలుడు మృతి
కొమురంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం వాంకిడి మండలంలో ప్రమాదవశాత్తు పది నెలల బాలుడు బకెట్లో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం. తేజాపూర్ గ్రామానికి చెందిన గిర్మాజీ- సునీత దంపతుల కుమారుడు తన్వీజ్ ఆడుకుంటూ వెళ్లి బాత్ రూమ్లో ఉన్న బకెట్లో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి బాలుడు మృతి చెంది కనిపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ పోశెట్టి తెలిపారు.

సంబంధిత పోస్ట్