భీమవరం: పుంతలో ముసలమ్మ అమ్మవారికి కేజీ వెండి అభరణాలు బహుకరణ
భీమవరం 24వ వార్డులోని పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలోని అమ్మవారికి భక్తులు దాతల సహకారంతో కేజీ వెండితో సహకారంతో తయారు చేసిన అభరణాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) చేతుల మీదుగా ఆలయ కమిటీకి శనివారం అందించారు. ముందుగా అర్చకులు దసరా సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించి సుమారు రూ 1 లక్ష విలువ కలిగిన కేజీ వెండితో తయారు చేసిన వెండి అభరణాలను అమ్మవారికి అలంకరణ చేశారు.