కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
కొయ్యలగూడెం మండలం చొప్పురామగుడెంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నాలుగు రోడ్డు జంక్షన్లో మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటనలో గాయపడిన వారిని స్థానికుల సహాయంతో కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ప్రమాద ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.