ఆడబిడ్డల జోలికి వస్తే జాగ్రత్త: CBN

66చూసినవారు
‘ఆడబిడ్డల జోలికి వస్తే జాగ్రత్త’ అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదన్నారు. ‘రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకున్నారు. ముసుగు ఊడదీస్తాం. రౌడీలను రౌడీలుగా, నేరస్తులను నేరస్తులుగానే చేస్తాం. వైఎస్ఆర్ భార్య, కూతుళ్లపై తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదు. మనుషులు మనుషులుగా ఉండాలి. మృగాలుగా ఉండొద్దు’ అని సీఎం అన్నారు.

సంబంధిత పోస్ట్