ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఓ ముస్లిం కుటుంబానికి చెందిన శుభలేక ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ముస్లిం కుటుంబానికి చెందిన ఓ యువతి పెళ్లి కార్డుపై హిందూ దేవుళ్లు, దేవత ఫొటోలు ముద్రించారు. సింగ్పూర్ బ్లాక్ అల్లాదిన్ గ్రామానికి చెందిన షబ్బీర్ టైగర్ కుమార్తె సైమా బానో వివాహం నవంబర్ 8న జరగనుంది. అయితే, సమాజానికి సానుకూల సందేశం అందేలా, సోదర భావాన్ని పెంపొందించేందుకు వీలుగా కార్డులపై హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించినట్లు షబ్బీర్ చెప్పారు.