పెళ్లి పత్రికపై వినాయక చిత్రాన్ని ముద్రించిన ముస్లిం కుటుంబం

71చూసినవారు
పెళ్లి పత్రికపై వినాయక చిత్రాన్ని ముద్రించిన ముస్లిం కుటుంబం
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ ముస్లిం కుటుంబం తమ కుమార్తె పెళ్లి కార్డుపై గణేశుడి చిత్రాన్ని ముద్రించింది. హిందూ సమాజంలోని ప్రజలకు ప్రేమపూర్వక ఆహ్వానం కోసం ఈ కార్డును ముద్రించినట్లు వధువు తండ్రి షబ్బీర్ చెప్పారు. “నా కుమార్తె పెళ్లి కార్డును హిందూ, ముస్లిం మతాలకు అనుగుణంగా ముద్రించా. హిందూ స్నేహితులకు హిందూ కార్డులు, ముస్లింలకు ముస్లిం కార్డులు ఇస్తున్నా," అని ఆయన చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్