Feb 19, 2025, 02:02 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ఆదిలాబాద్: జిల్లా అభివృద్ధికి కృషి చేయండి
Feb 19, 2025, 02:02 IST
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా, తీవ్ర అన్యాయం చేస్తున్నదని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా ప్రజల ఆకాంక్ష ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, విమానశ్రయం, సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అరుణ్, నర్సింగ్ రావు, మహబూబ్ ఉన్నారు.