పోలవరాన్ని సందర్శించనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జులై 19 న పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి తాత్కాలిక ముందస్తు పర్యటన వివరాలు.. సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా, తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి, హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఉ. 10. 10 కి బయలుదేరి పోలవరం లోని హెలిప్యాడ్ కు ఉ. 11 గంటలకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుండి బయలుదేరి కాపర్ డ్యామ్, తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. తదుపరి అక్కడ నుంచి ఉ. 11. 50 గంటలకు బయలుదేరి సమావేశ మందిరంకు మ. 12. 00 కి చేరుకుని మ. 1. 00 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పోలవరం లోని సమావేశ మందిరం నుంచి మ. 1. 10 బయలుదేరి హెలిప్యాడ్ కు చేరుకుని మ. 1. 20 కు అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కు చేరుకుంటారు.