సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఇప్పేపల్లిలో చెరుకు తోటలో కార్చిచ్చు చెలరేగింది. 20 ఎకరాల్లోని చెరుకులో మంటలు ఎగిసిపడుతున్నాయి. డ్రిప్, నీటి పైప్ లైన్లు కాలి బూడిదవుతున్నాయి. ఘటనాస్థలికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పుతున్నా అదుపులోకి రావట్లేదు. కోతకొచ్చిన పంటలు తగలబడడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. అగ్నిప్రమాదంతో రూ. 50 లక్షలకు పైగా అస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా.