YCPకి ఒంటరితనం ఎంతటి భయంకరమో ఇప్పుడు అర్థం అవుతోంది. కమ్యూనిస్టులతో దోస్తీ చేస్తే ఎలా ఉంటుందనే కొత్త ఆలోచనలు వైసీపీలో వస్తున్నాయట. కమ్యూనిస్టులు అయితే పోరాటాలకు పెట్టింది పేరు. వారు ప్రజా సమస్యల మీద గట్టిగా మాట్లాడతారు. ఇక వారితో జట్టు కడితే బలమైన పార్టీగా ఉన్న వైసీపీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారట. అయితే వామపక్షాల నుంచి ఏమైనా సంకేతాలు వస్తేనే పొత్తు ప్రతిపాదనలకు సిద్ధం కావాలని చూస్తున్నారట.