ఏపీ కేబినెట్ ఈ నెల 18న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు అత్యవసరంగా మంత్రివర్గం భేటీ కానుంది. ఈ నెల 22 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బుధవారం అసెంబ్లీలో పంచాయతీ రాజ్ బిల్లు-2024, మున్సిపల్ బిల్లు-2024, ప్రభుత్వ ఉద్యోగుల-2024 బిల్లును ప్రవేశపెట్టారు.