వైసీపీకి త్వరలోనే బిగ్ షాక్ తగలనుంది. ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. తాజాగా వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఆ ఇద్దరిని పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే కాగా మరొకరు రాయలసీమ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అని సమాచారం.