ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలను తగ్గించడం ద్వారా వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని టీడీపీ భారీ స్కెచ్ వేసిందని అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని జగన్ కి షాక్ ఇస్తే ఇక అసెంబ్లీలో వైసీపీ హాజరైనా కూడా ఆ వేడీ వాడి ఉండదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందులో రాయలసీమ నుంచి ఒకరు, ఉత్తరాంధ్రా నుంచి గెలిచి వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్లు సమాచారం.