Top 10 viral news 🔥
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్రం, కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఆయన స్మారకార్థం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించాలని కోరగా కేంద్రం స్పందించకపోవడంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ని సంప్రదించకుండానే నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తామని హోం శాఖ ప్రకటించింది. ఇప్పటికే ఈ విషయంపై ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు.