
దస్తగిరి భార్యపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
AP: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షి దస్తగిరి భార్య షబానాపై దాడి జరిగింది. ఖుల్సుమ్, పర్వీన్ అనే మహిళలపై దస్తగిరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొండూరు మండలం మల్లెల గ్రామంలో తనపై దాడి జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త దస్తగిరిని చంపుతామని ఇద్దరు మహిళలూ బెదిరించినట్లు షబానా చెప్పారు. తనకు, తన భర్తకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.