AP: రాష్ట్ర ప్రజలకు విద్యుత్ సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఈపీడీసీఎల్ రూ.383.84 కోట్లు, ఎస్పీడీసీఎల్ రూ.428.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.247.35 కోట్ల చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. 2019-24 మధ్య పెట్టుబడి వ్యయం కింద వివిధ పనులకు ఏపీఈఆర్‌సీ అనుమతించిన ఖర్చు, వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం ఉంది.