AP: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడిపత్రి పట్టణంలోని శ్రీనివాసపురానికి చెందిన శైలజ (47), సురేంద్రబాబు దంపతుల కుమారుడు శ్రీచరణ్. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. శ్రీచరణ్ డిప్లొమా వరకు చదివాడు. అయితే అనుకోని రీతిలో శ్రీచరణ్ మూడు రోజుల కిందట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నపేగు దూరం కావడంతో శైలజ తల్లడిల్లిపోయారు. నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేనంటూ ఆమె కూడా రైలు కింద పడి తనువు చాలించారు.