బట్టతల ఉందని భార్య హేళన.. భర్త సూసైడ్

68చూసినవారు
బట్టతల ఉందని భార్య హేళన.. భర్త సూసైడ్
భార్య తరచూ హేళన చేస్తుండటంతో మనస్తాపం చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. కర్ణాటక చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యా భర్తలు. పెళ్లినాటికే అతడికి బట్టతల ఉన్నప్పటికీ.. మమత మాంత్రం పెళ్లయ్యాక 'నీతో బయటికి వెళ్లాలంటే అవమానంగా ఉంటోంది. తలపై జుట్టూ లేదు చేతిలో డబ్బూ లేదు' అంటూ అవమానించేది. ఈ క్రమంలో వరకట్నం కేసు పెట్టి అతడిని జైలుకు పంపించింది. బెయిల్‌పై బయటికొచ్చిన మూర్తి ఆ బాధల్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్