AP: అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. ఆదివారం రాత్రి భారీ వాహనం వంతెన కింద వెళ్తూ గడ్డర్‌ను ఢీకొంది. దాంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ క్రమంలో విశాఖ-విజయవాడ మధ్య పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపివేశారు. ఎలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు.