ఉత్తరాఖండ్లో బస్సు ప్రమాదం.. 22 మంది మృతి (VIDEO)
ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లా మర్చులా వద్ద 45 మందితో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇప్పటికే 22 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సహాయక బృందాలు తక్షణమే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దిగ్బ్రాంతి చెందినట్లు తెలిపారు.