నాంప‌ల్లి నుమాయిష్ రెండు రోజులు పొడిగింపు

70చూసినవారు
నాంప‌ల్లి నుమాయిష్ రెండు రోజులు పొడిగింపు
హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ను ఈనెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతించిందని స్పష్టం చేశారు. స్టాల్ యజమానులు నుమాయిష్‌ను పొడిగించాలని విన్నవించారని తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు అనుమతి కోసం వినతిపత్రం సమర్పించామని, కమిషనర్ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్