TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ A11గా ఉండగా, థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి A1గా ఉన్నారు. A3గా థియేటర్ మరో భాగస్వామి సందీప్, A9గా సీనియర్ మేనేజర్ నాగరాజు, A10గా అప్పర్ లోయర్ బాల్కనీ ఇన్‌ఛార్జ్ విజయ చంద్రన్‌ను పోలీసులు చేర్చారు. అటు చంచల్‌గూడ జైల్లో ఉన్న అల్లుఅర్జున్ 7 గంటలకు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.