బెయిల్ మంజూరైనా పలు కారణాలతో అల్లు అర్జున్ నిన్న చంచల్ గూడ జైలు నుంచి విడుదల కాలేదు. దీంతో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రైల్ ఖైదీగా (ఖైదీ నంబర్ 7697) మంజీరా బ్యారక్‌లో ఉంచారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్‌లోనే ఉంచిన సిబ్బంది ఆపై బ్యారక్‌లోని క్లాస్-1 రూమ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్లు సమాచారం. కాగా మరికాసేపట్లో అల్లుఅర్జున్ విడుదల కానున్నారు.